కారేపల్లి: విద్యుత్ శాఖ-పొలంబాట
విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం కారేపల్లి మండలం చీమలపాడు సెక్షన్ పరిధిలోని నానునగర్ తండా పరిధిలో పోలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఈ రామకృష్ణ రైతులతో మాట్లాడుతూ.. మోటార్లపై పడే ఓల్టేజి హెచ్చుతగ్గులు, ట్రాన్స్పార్మర్లపై పడే ఓవర్ లోడ్ గురించి, భద్రత సూచనలపై వివరించారు. కార్యక్రమంలో సబ్ స్టేషన్ సిబ్బంది పలువురు రైతులు పాల్గొన్నారు.