కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అజింక్య రహానే అప్పగించిన సంగతి తెలిసిందే. దీని వల్ల కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో జట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. రహానేను కేవలం సారథ్య బాధ్యతల కోసమే ఎంపిక చేసి ఉంటే.. కెప్టెన్సీని అతడికి బదులుగా సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రస్సెల్ లాంటి వారికి అప్పగించి ఉండాల్సిందని హర్భజన్ అభిప్రాయపడ్డారు.