విషాదం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్
TG: హైదరాబాద్లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్లో నవీన్ రెడ్డి (24) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురువారం మైండ్ స్పేస్ 13వ అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు. ఈ క్రమంలో నవీన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.