కాగజ్‌నగర్ బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారి చెక్ పోస్టు నుండి డాడానగర్ చౌరస్తా వరకు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం సీపీఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చారు. స్పీడ్ బ్రేక్ లు లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కోరారు.