

కాగజ్‌నగర్‌లో కార్డెన్ సెర్చ్
కాగజ్‌నగర్ డిఎస్పి రామానుజన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని వినయ్ గార్డెన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇద్దరు సీఐలు, పదిమంది ఎస్ఐ లు, 100 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని సుమారు 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలకు సంబంధించి వెరిఫికేషన్ చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.