హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలకు కోమటిరెడ్డి వార్నింగ్

83చూసినవారు
హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలకు కోమటిరెడ్డి వార్నింగ్
కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వరుసగా మాటల దాడి చేస్తున్న హరీష్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గురువారం నల్లగొండలో రంజాన్ వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏక్ నాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ అన్నారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందన్నారు. రేవంత్ పదేళ్లు సీఎంగా ఉంటారని.. అందరం ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్