ఆయిల్ ఫాం సాగు ద్వారా రైతులు దీర్ఘకాలం నికర ఆదాయం పొందవచ్చని ఉద్యాన అధికారి సందీప్, అయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ తెలిపారు. అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చని చెప్పారు. కామారెడ్డి జిల్లా తాడువాయి, లింగంపేట, మోతే గ్రామాల రైతులు మంగళవారం ఆయిల్ ఫాం సాగు అధ్యయనం కోసం అశ్వారావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం, ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను రైతులకు వివరించారు.