రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

73చూసినవారు
రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
జిల్లా రైతాంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ములకలపల్లి మండల పరిధిలోని మాదారంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, రవికుమార్, సాంబశివరావు, సత్యనారాయణ, జగన్నాథం,కేశవరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్