
విశాఖ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక
AP: విశాఖ మేయర్ పీఠం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆయన పేరును జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించగా.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. మిగతా సభ్యులంతా మద్దతు ఇవ్వడంతో పీలా శ్రీనివాసరావు గెలిచారు. కాసేపట్లో గుంటూరు మేయర్ ఫలితాలు వెలువడనున్నాయి.