దుమ్ముగూడెం మండలం తోగ్గుడెం గ్రామ శివారులో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, స్టేషన్ సిబ్బంది కలిసి శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో సజ్ఞానాపురం గ్రామానికి చెందిన భూక్యా లాల్ బైక్ పై వస్తుండగా పోలీసులు అతని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద 40 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. బైక్ ను స్వాధీనం చేసుకొని స్టేషనుకు తరలించారు. ఎస్సై కేశవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.