రాముడి ఆదాయం 14, వ్యయం 2

71చూసినవారు
రాముడి ఆదాయం 14, వ్యయం 2
భద్రాచలం దేవస్థానంలో మంగళవారం క్రోధినామ తెలుగు సంవత్సరాది వేడుకలను వైభవోపేతంగా జరిపారు. బేడా మండపంలో స్థానాచార్యులు కేఈ స్థలశాయి పంచాంగ పఠనం చేయగా, భక్తులు శ్రద్ధగా ఆలకించారు. ఈ ఏడాది రాముడి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6 అని తెలిపారు. సీతమ్మవారి ఆదాయం 5, వ్యయం 5 అని, రాజపూజ్యం 5, అవమానం 2 అని పేర్కొన్నారు. జ్యేష్టమాసం శుక్లపక్షంలో తొలకరులు ఉంటాయని, సస్య వృద్ధి ఉంటుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్