
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్
AP: మందుబాబులకు కూటమి ప్రభుత్వం కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్రీస్టార్ సహా ఆపై స్థాయి హోటళ్లలో వార్షిక బార్ లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని ప్రభుత్వం భారీగా తగ్గించింది. రూ.66.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఫీజును తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి తగ్గించి ఫీజులు అమల్లోకి రానున్నాయి.