ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

81చూసినవారు
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, పరిష్కరించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత శాఖ అధికారులకు దరఖాస్తులను ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్