ఎంపీటీసీ కుంజా కృష్ణకుమారికి ఘన నివాళి

542చూసినవారు
ఎంపీటీసీ కుంజా కృష్ణకుమారికి ఘన నివాళి
మణుగూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని నామ మాత్రంగా నిర్వహించారు. తొలుత ఇటీవల అనారోగ్యంతో మరణించిన పగిడేరు ఎంపిటిసి సభ్యురాలు కుంజా కృష్ణకుమారి మృతికి సంతాప సూచికంగా రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పలు శాఖలకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చలు జరపకుండానే సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్