సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం ఫోకస్
ఏపీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ సీజనల్లో వ్యాపించే వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్పై కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అప్రమత్తం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సీజనల్ ఫీవర్ ఎమర్జెన్సీ కిట్లను తరలించింది. కలుషిత నీటిపై అధికారులు ఫోకస్ పెట్టాలని, ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించింది.