సింగరేణి అధికారులు, ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకతీయ యూనివర్సిటీ కొత్తగుడెంలో బిటెక్ కోర్స్ చేయుటకు దరఖాస్తులు కోరుతున్నట్లు జీయం జాన్ ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారుల, ఉద్యోగుల పిల్లలకు 10 సీట్లు వివిధ విభాగాలలో కేటాయించారని తెలిపారు. కౌన్సిలింగ్లో ఎంపికైన అభ్యర్ధులు ప్రవేశ రుసుం వెంటనే చెల్లించాలని, దరఖాస్తులను జూన్ నెల 30వ తేదీ లోపు అందజేయాలని తెలియజేశారు.