ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు
ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టు తీపికబురు చెప్పింది. 3 నెలల్లోగా కోర్టుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తింప చేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అయితే జీపీఎఫ్ వర్తింపచేయాలా? ఈపీఎఫ్ అమలు చేయాలా? అనేది ప్రభుత్వ నిర్ణయమని కోర్టు తెలిపింది. విద్యుత్ ఉద్యోగులకు ఏ స్కీమ్ అమలు చేయాలనేది ప్రభుత్వాన్ని ఆదేశించలేమని పేర్కొంది.