ఖమ్మం
ఖమ్మంలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం
ఖమ్మంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా నగరవాసులు ఉపశమనం పొందారు. స్థానిక మయూరి సెంటర్ , వైరా రోడ్, పాత బస్టాండ్ రహదారులన్నీ జలమయంగా మారాయి. వర్షపు నీరు స్థానికంగా ఉండే దుకాణాల్లోకి చేరింది. దీంతో వినియోగదారులు, దుకాణాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువల్లోని డ్రైనేజీ ఉప్పొంగి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి.