ఏపీ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించేలా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మిస్తున్న 56.53 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్‌కు తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను కాంపిటెంట్ అథారిటీగా నియమిస్తూ నిన్న ఉత్తర్వులిచ్చింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నారు.