నవ్వుకి యుగయుగాల చరిత్ర

71చూసినవారు
నవ్వుకి యుగయుగాల చరిత్ర
నవ్వుకి యుగయుగాల చరిత్ర ఉంది. ఇతిహాసాలను మలుపు తిప్పిన వైనమూ ఉంది. ద్వాపరంలో మయసభలో రారాజు తడబాటుని చూసి ద్రౌపది నవ్వి ఉండకపోతే కురుక్షేత్రమూ లేదు, భగవద్గీతా లేదు. ఇక జానపద రామాయణంలో లక్ష్మణస్వామి నవ్వు అందరినీ భుజాలు తడుముకునేలా చేస్తుంది. తెలుగు సాహిత్యంలో ఎన్నో పాత్రలు సజీవంగా రూపుదిద్దుకుని మనల్ని నవ్విస్తూనే ఉన్నాయి. కొందరు నవ్వించడానికే రచనలు చేసి హాస్య బ్రహ్మలుగా రాణించారు.

సంబంధిత పోస్ట్