ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. ‘తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శం. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం పునరంకితమవుదాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.