తమిళనాడులో మనిషిలా నాడి కొట్టుకునే గణపతి ఆలయం

69చూసినవారు
తమిళనాడులో మనిషిలా నాడి కొట్టుకునే గణపతి ఆలయం
తమిళనాడులోని కుర్తాళంలో ఒక గణపతి ఆలయం ఉంది. పురాతన కాలంలో మహా సిద్ధయోగి మౌనస్వామి వినాయకుడి విగ్రహన్ని ప్రతిష్టించి, ప్రాణ ప్రతిష్ట చేయాలని భావించారు. దీనికి బ్రిటిష్ వాళ్లు రాతికి ప్రాణ ప్రతిష్ట ఏమిటంటూ హేళన చేశారట. అప్పుడు ఆ సిద్దయోగి ఒక వైద్యుడిని పిలిపించి, విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పగా.. నాడి చప్పుడు లేదని చెప్తాడు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశాక.. విగ్రహానికి మనిషి వలే నాడి కొట్టుకోవడం వైద్యుడు గమనించాడు. అప్పటి నుంచి ఈ గణపతికి 'నాడి గణపతి' అనే పేరు వచ్చింది.

సంబంధిత పోస్ట్