పైరసీ రక్కసి రోజు రోజుకీ విజృంభిస్తుండటంతో చిత్ర పరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమకే పరిమితమైన పైరసీ ప్రస్తుతం అంటువ్యాధిలా ఓటీటీలకూ పాకిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏడాదికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.