వరదల వల్ల నష్టాలు

74చూసినవారు
వరదల వల్ల నష్టాలు
వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఇళ్లు, పంటపొలాలు దెబ్బతింటాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం వల్ల అది వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. పంటపొలాలు మునిగిపోయి అధిక నష్టం కలుగుతుంది. వరదల వల్ల అనేకమంది నిరాశ్రయులవుతారు. పశువులు మృత్యువాత పడతాయి. తాగునీరు కలుషితమవుతుంది. తాగడానికి మంచినీరు దొరకదు.
కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, కలరా లాంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిని రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది.

సంబంధిత పోస్ట్