TG: ఖమ్మం నగరంలోని తెలంగాణ ఫ్రీడం పార్క్ లోకి ప్రేమికులను అనుమతించడం లేదు. పార్క్ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో 'లవర్స్కి అనుమతి లేదు' అంటూ అక్కడ మున్సిపల్ సిబ్బంది బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. 'సైకిల్స్ను తీసుకురావద్దు', 'సాయంత్రం 4 తర్వాత క్రికెట్ ఆడరాదు', 'పార్కులోకి సిగరెట్ వాడరాదు' అని రాసి ఉన్న బోర్డులు సైతం పెట్టారు. సంబంధిత ఫొటోలు వైరల్గా మారాయి.