వంగూరు మండలంలో మోస్తారు వర్షం

61చూసినవారు
వంగూరు మండలంలో మోస్తారు వర్షం
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షంతో పశుగ్రాసం కొరత కొంత కాలం వరకు ఉండదని, విత్తనాలు నాటుకోవటానికి అదును లభించిందని మండలానికి చెందిన పలువురు రైతులు సోమవారం తెలిపారు. ఈ వర్షాలతో మండలంలో వ్యవసాయ పనులు ఊపు అందుకోనున్నాయి.

సంబంధిత పోస్ట్