
దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ ప్రమాదకరం: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం మాకు సహకరించడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కేరళలో రేవంత్ మాట్లాడుతూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదు.. దక్షిణాది రాష్ట్రాల మీద ఎందుకు వివక్ష అంటూ నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ ప్రమాదకరం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని రేవంత్ మండిపడ్డారు.