బిజినేపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

10953చూసినవారు
బిజినేపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కర్ణాటక వాసులు మృతి చెందారు. శ్రీశైలం నుంచి కర్ణాటకకు వెళ్తున్న క్రూసర్ వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. వీరంతా శ్రీశైలంలో దైవ దర్శనం చేసుకుని కర్ణాటకకు తిరిగి వెళుతున్నారు. గాయపడిన వారిని, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్