మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో ఎస్జిడి ఫార్మా కంపెనీ వద్ద మంగళవారం సాయంత్రం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫార్మా కంపెనీ సీఈఓ దీపక్ సూద్ తో కలిసి సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మా కంపెనీ ప్రతినిధులు, కాంగ్రెస్ ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.