ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవాలి: గద్వాల ఎమ్మెల్యే

53చూసినవారు
ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవాలి: గద్వాల ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, తద్వారా అన్ని వర్గాల ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో జీవించేలా అల్లాను ఆయన ప్రార్థించారు. గద్వాల ప్రాంతంపై అల్లా దయ ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్