ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 డిపోల నుంచి 649 ప్రత్యేక బస్సులను రాబోయే దసరా పండుగ సందర్భంగా నడపనున్నట్లు సోమవారం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి. శ్రీదేవి తెలిపారు. అచ్చంపేట డిపో 105, జోగులాంబ గద్వాల- డిపో 89, కల్వకూర్తి- డిపో 67, కొల్లాపూర్-డిపో 58, మహబూబ్ నగర్- డిపో 69, నాగర్ కర్నూల్-డిపో 53, నారాయణపేట-డిపో 54, షాద్ నగర్ డిపో 59, వనపర్తి డిపో 95 బస్సులు నడపనున్నామన్నారు.