
దయచేసి అలా చేయకండి: హీరో సూర్య
పహల్గాంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సినీ నటుడు సూర్య ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్లో రెట్రో చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో సూర్య మాట్లాడుతూ.. "టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా మిగిల్చేది నష్టాన్నే. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగకూడదని ప్రార్థిస్తున్నా. నా అభిమానులు వారి చేతిపై నా పేరును టాటూలుగా వేసుకోవడాన్ని నేను అంగీకరించను. దయచేసి అలా చేయకండి. ప్రతి ఒక్కరూ మీ జీవితంపై దృష్టి పెట్టండి." అని అన్నారు.