సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే: మంత్రి జూప‌ల్లి

61చూసినవారు
సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే: మంత్రి జూప‌ల్లి
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే అని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ క్యాంప్ కార్యాల‌యంలో మ‌హాత్మా జ్యోతి పూలే 198వ జ‌యంతి వేడుక‌లలో మంత్రి పాల్గొన్నారు. పూలే చిత్ర‌ప‌టానికి పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్యఅందాలని పూలే భావించారన్నారు.

సంబంధిత పోస్ట్