
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన గుటెరస్‌కు ధన్యవాదాలు: జైశంకర్
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడినవారిని, మద్దతుదారులను, దాడికి ప్రణాళిక రచించిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని నిశ్చయించుకున్నామని ఆంటోనియో గుటెరస్‌కు జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా జైశంకర్ ట్వీట్ చేశారు.