భక్తి శ్రద్ధల మధ్య మిలాద్- ఉన్- నబీ జూలూస్

69చూసినవారు
భక్తి శ్రద్ధల మధ్య మిలాద్- ఉన్- నబీ జూలూస్
నాగర్ కర్నూల్ లో మిలాద్- ఉన్- నబీ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం భక్తి శ్రద్ధల మధ్య శోభాయాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రానికి చెందిన యువకుల ఆధ్వర్యంలో శుక్రవారం రంగురంగుల జెండాలను చేతబూని పెద్దలు, యువకులు నారయే తక్బీర్ నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త కీర్తిని కొనియాడుతూ యువకులు నాతియా కలాం పాడుతూ ముందుకు సాగారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్