నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్లు, పి అమరేందర్, దేవ సహాయం సోమవారం అన్నారు. సమగ్ర సమాచారంతో రిపబ్లిక్ డే ఇన్విటేషన్ కార్డ్స్ తయారు చేయాలని కలెక్టరేట్ ఏవోను ఆదేశించారు.