ఉప్పునుంతల మండలంలోని దుందుభి నది పరివాహక గ్రామాలైన పెద్దాపూర్, మొలగర, జప్తి సదగోడు గ్రామాల ప్రజలకు రాత్రులు కునుకు లేకుండా ఇబ్బందులకు గురవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల శబ్దానికి రాత్రిళ్ళు నిద్ర రావడంలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల శబ్దానికి నిద్ర పట్టడం లేదు జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టి కట్టడి చెయ్యాలి.