రైతు పంట పొలాల్లో కనిపించిన రైతు నేస్తాలు

54చూసినవారు
రైతు పంట పొలాల్లో కనిపించిన రైతు నేస్తాలు
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగలమడక గ్రామంలో శనివారం మోస్తారు వర్షం కురిసింది. రైతుల పంట పొలాల్లో ఆరుద్ర కీటకాలు దర్శనమిచ్చాయి. వీటినే రైతు నేస్తాలుగా పిలుస్తారు. ఆరుద్ర కీటకాలు కనిపించడంతో రాబోయే కాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతులు భావిస్తూ, హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆరుద్ర కార్తి ప్రారంభంకావడంతో గత వారం రోజుల నుండి వరి నార్లు పోయడంపై దృష్టి సారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్