రన్నింగ్లో ఊడిపోయిన కారు టైరు.. షాకింగ్ వీడియో
కేరళలోని అలప్పుళ జిల్లాలో శుక్రవారం (జనవరి 3)న ఊహించని ప్రమాదం జరిగింది. కయంగుళం ప్రాంతంలో ఓ కారు వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా కారు టైర్ ఊడిపోయింది. అయితే 20 మీటర్ల దూరంలో ఆ కారు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారెవరూ గాయపడలేదు. సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.