బస్సుల సంఖ్య పెంచాలని వినతి

76చూసినవారు
బస్సుల సంఖ్య పెంచాలని వినతి
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు బస్సుల సంఖ్య పెంచాలని మంగళవారం నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మి సుధాను కలిసి వినతి పత్రం అందించినట్లు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సౌజన్య తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా పెట్టడంతో గ్రామీణ మహిళలు పట్టణ ప్రాంతాలకు వచ్చి పనులు చేసుకుని వెళ్తుండటంతో రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్