వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో శుక్రవారం మార్నింగ్ వాక్ లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి చిలక జోస్యం చెప్పించుకోమని ఎమ్మెల్యేని అడిగారు. చిలక జోస్యం చెబుతూ ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఎటు వెళ్లిన ఎదురులేదని, భవిష్యత్తులో మంచి ఆదరణ ఉందన్నారు. చిలక జోస్యం పలువురు చూపరులను ఆకట్టుకుంది.