హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి: డిఎంహెచ్ఓ

75చూసినవారు
హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి: డిఎంహెచ్ఓ
విద్యార్థి దశ నుండే హెచ్ఐవి, ఎయిడ్స్ పై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా డిఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ అన్నారు. శుక్రవారం వనపర్తిలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను డిఎంహెచ్ఓ వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ గోవిందరాజులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్