రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి మండలం వెల్టూర్ లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఒక్కో సర్వేయర్ రోజుకు కనీసం 25ఇండ్లు సర్వే పూర్తి చేయాలని, డేటా ఆన్‌లైన్ లో తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.