వనపర్తి: నూతన ఎన్ఆర్సి పిల్లలకు వరం: ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటైన న్యూట్రీషియన్ రిహాబ్లిటేషన్ సెంటర్ ను (ఎన్ఆర్సి) ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎన్ఆర్సి ద్వారా వైద్య సేవలు పొందనున్న పిల్లల తల్లులతో మాట్లాడారు. ఎన్ఆర్సి ఇన్ఛార్జ్ డా. పరిమళ మాట్లాడుతూ. జిల్లాలో 0-5 మధ్య గల 149 మంది పిల్లలకు కేంద్రం ఉపయోగ పడనుందన్నారు. వైద్యం కోసం గతంలో పిల్లలను తీసుకొని మహబూబ్ నగర్ వెళ్లాల్సి వచ్చేదని అన్నారు.