ఇజ్రాయెల్ పర్యాటకులపై మాల్దీవులు నిషేధం

81చూసినవారు
ఇజ్రాయెల్ పర్యాటకులపై మాల్దీవులు నిషేధం
మాల్దీవులు ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి ఇజ్రాయెల్ పౌరులు రాకుండా నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ అండ్ టెక్నాలజీ మంత్రి అలీ ఇహ్సాన్ ప్రకటించారు. మాల్దీవుల్లోకి ఇజ్రాయేలీయులు ప్రవేశించకుండా నిరోధించడానికి అవసరమైన చట్టాలను సవరించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పాలస్తీనాకు మద్దతుగా మాల్దీవులు ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్