శంకరంబాడి సుందరాచారి గొప్పకవి. ఆయన పద్యాలు ఎక్కువ భాగం తేటగీతి ఛందస్సులోనే ఉంటాయి. మా తెలుగుతల్లికి మల్లెపూదండ కూడా తేటగీతిలోనే వ్రాశారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని నాలుగు పద్యాలలో రమ్యంగా రచించాడు. ప్రఖ్యాత గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.