ఫోన్ ఇవ్వనందుకు వ్యక్తిపై పదునైన ఆయుధంతో దాడి (వీడియో)

583చూసినవారు
ముంబైలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ధారావి ప్రాంతంలో మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తిపై పదునైన ఆయుధంతో పలువురు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం 9.24 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. యువకుడి వద్ద ఫోన్‌ను దోపిడీ చేసి లాక్కునే ప్రయత్నంలో అతడిపై దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్