బెల్లంపల్లి మండలంలోని దుగ్నేపల్లి గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉపాధ్యాయిని నియమించాలని గ్రామస్తులు బెల్లంపల్లి మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాలకు సరైన సమయంలో ఉపాధ్యాయుడు రాని కారణంగా గ్రామంలోని ప్రజలు తమ తమ పిల్లలను ఇతర గ్రామాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకి పంపించే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.