మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు గడ్డం వినోద్ వెంకటస్వామి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలో ఆయనను వినోద్ కుటుంబ సమేతంగా కలిశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితిని వారికి సమగ్రంగా వివరించారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు ఖర్గే కు వినోద్ వెల్లడించారు.