తాండూర్ మండలంలోని మాదారం త్రీ ఇంక్లైన్, ఫైవ్ ఇంక్లైన్ గ్రామాల్లో ఆదివారం బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి నాయకులు మహీధర్ గౌడ్, దూడపాక భరత్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచార నిర్వహించారు. బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.